Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలువిద్యహైదరాబాద్

Hyderabad : విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి..!

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని శ్రీ చైతన్య స్కూల్ దిల్ సుక్ నగర్ జోన్ ఏజీఎం వెంకట్ రెడ్డి సూచించారు.

Hyderabad : విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి..!

మన సాక్షి, హైదరాబాద్ :

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని శ్రీ చైతన్య స్కూల్ దిల్ సుక్ నగర్ జోన్ ఏజీఎం వెంకట్ రెడ్డి సూచించారు. హయత్ నగర్ పరిధిలోని సాయి నగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ లో గురువారం స్టూడెంట్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.

హెడ్ బాయ్. హెడ్ గర్ల్. వైస్ కెప్టెన్లు. హౌస్ కెప్టెన్లు. వివిధ నాయకులుగా బాధ్యతలు స్వీకరించి నిజాయితీ సేవాభావంతో పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏజీఎం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యతోపాటు విలువలు. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంజనీ దేవి మాట్లాడుతూ నాయకత్వం అనేది హోదా కాదని బాధ్యతగా గుర్తించాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ సమయపాలన. సేవా దృక్పథంతో ముందుండి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రఘు వంశీ. పిఈటి అనిల్. జోనల్ ఇన్ జార్జి పి ఈ టి అయోధ్య. డీన్ రఘుపతి. సి బ్యాచ్ ఇన్ చార్జీ సోమయ్య. ఏవో ప్రమోద్ గౌడ్. విద్యార్థులు. తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు