Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Ration Cards : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట..!

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు భారీ ఊరట కల్పించింది. ఈకేవైసీ (E - KYC) పై కీలక నిర్ణయం తీసుకున్నది.

Ration Cards : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు భారీ ఊరట కల్పించింది. ఈకేవైసీ (E – KYC) పై కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ఈ కేవైసీ పూర్తి చేసే గడువును పొడిగించింది.

జూలై 31వ తేదీ వరకు ఈ కేవైసీ పూర్తి చేయాలని మొదట్లో గడువు విధించినప్పటికీ వివిధ కారణాలవల్ల నెలరోజుల పాటు ఈ కేవైసీ గడువును పొడిగించింది. ఆగస్టు 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ఈ కేవైసీ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. దాంతో ఈ కేవైసీ పూర్తి చేయని రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఆగస్టు ఒకటవ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రేషన్ దుకాణం వద్దకు వెళ్లిన సమయంలో ఈ కేవైసీ పూర్తయిందో..? లేదో..? తెలుసుకొని వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు కోరారు.

MOST READ 

మరిన్ని వార్తలు