Suryapet : సూర్యాపేట జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి దరఖాస్తులు ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలి..!
ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

Suryapet : సూర్యాపేట జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి దరఖాస్తులు ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలి..!
సూర్యాపేట, మనసాక్షి :
ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
పాత ప్రజావాణి పోర్టల్‌లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు.
ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంపై కూడా కలెక్టర్ సమీక్షించారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 59 దరఖాస్తులు,
డిడబ్ల్యుఓ 10, డిపిఓ 7, డి ఏం అండ్ హెచ్ ఓ 6, మిగిలిన 35 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 117 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, సిపిఓ కిషన్, డిఇఓ అశోక్, డిపిఓ యాదగిరి జిల్లా అధికారులు, తదితరులు హాజరైనారు.
MOST READ
- Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. 855.10 అడుగులకు చేరిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!
- Miryalaguda : మిర్యాలగూడలో చింతపల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. మృతి చెందిన మహిళ, బిఎల్ఆర్ పరామర్శ..!
- Viral : రైతు సాహసం.. మొసలిని భుజంపై మోస్తూ పోలీస్ స్టేషన్ కు.. వీడియో వైరల్..!
- Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఓపెన్ ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!









