Devarakonda : కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..!
ఆడబిడ్డల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

Devarakonda : కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..!
పంపిణి చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..
చింతపల్లి, మన సాక్షి :
ఆడబిడ్డల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం
దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.27,03,132 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సంబంధిత అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై వివాహ సమయంలో పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కల్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు.
కల్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించడం వల్ల కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తోందన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తూ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సహాయం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మూల సూత్రమని ఎమ్మెల్యే అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హ త కలిగిన కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన వారు తప్పకుండా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని ఎమ్మెల్యే బాలు నాయక్ నేను పెద్ద ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల వెంకటేశ్వర్లు, గుడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్, జరుపుల శంకర్, సంబంధిత శాఖ అధికారులు మరియు లబ్ధిదారులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నారు.









