సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూ. 35 కోట్ల ఆస్తి నష్టం
సికింద్రాబాద్, మనసాక్షి : అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సృష్టించిన విధ్వంసం వల్ల సుమారు రూ.35 కోట్లకు పైగా ఆస్తులకు నష్టం వాటిల్లినట్టు రైల్వే అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
ALSO TEAD : అయ్యయ్యో.. అమెరికా అధ్యక్షుడికి అలా జరిగిందే (వీడియో)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంలో 8 రైలింజన్లు దెబ్బతినగా, 4 రైలు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. మరో 30 ఏసి బోగీలు, 47 నాన్ ఏసీ బోగీలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. దీంతోపాటు ఎస్కలేటర్లు, ఫ్యాన్లు, ప్లాట్ ఫారాలపై ఉన్న దుకాణాలు, టీవీ స్క్రీన్లు, డిజిటల్ బోర్డులు ధ్వంసమయ్యాయని, స్టేషన్ లోని పార్సిల్ ఆఫీస్ కేంద్రంపైన నిరసనకారులు దాడులు చేయడంతో ఆయా ప్రాంతాలకు చెరవేయాల్సిన పార్సిళ్లు పూర్తిగా ధ్వంసం కావడం, కాలిపోయాయని అధికారులు వెల్లడించారు.
ALSO READ : BREAKING : బైక్ ను ఢీకొట్టిన డీసిఎం, మహిళ మృతి
సిగ్నలింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ పాక్షికంగా దెబ్బతిందన్నారు. ఆందోళనకారుల హింస కారణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి వెళ్లే సుమారు 250 రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, రైళ్ళను ఎక్కడికక్కడే నిలిపివేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.









