Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. పక్కా ఓటర్ల జాబితాయే లక్ష్యం..! 

ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. పక్కా ఓటర్ల జాబితాయే లక్ష్యం..! 

సూర్యాపేట, మనసాక్షి :

ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఆర్‌డీవో, తహసీల్దార్‌తో పాటు బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలతో కలెక్టర్ బుధవారం సూర్యాపేట మండల కేంద్రంలో సూర్యపేట తహసిల్దార్ గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఎన్యూమరేషన్ ఫారాల క్షేత్రస్థాయి పరిశీలన
సమావేశంలో ప్రధానంగా ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణ, డేటా నమోదుపై క్షుణ్ణంగా సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన ఫారాలను క్షేత్రస్థాయిలో రీ-వెరిఫికేషన్‌ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా అన్ కలెక్టెడ్ ఫారాలకు సంబంధించి ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ కేటగిరీల వారి వివరాలను పక్కాగా నిర్ధారించుకోవాలని చెప్పారు.

ఎక్కడైనా డూప్లికేట్ ఓట్లు లేదా ఒకే రకమైన సమాచారం నమోదై ఉంటే వాటిని వెంటనే గుర్తించి సరి చేయాలని ఆదేశించారు.
సవరణ ప్రక్రియకు గడువు పొడిగించినందున లభించిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్క అర్హుడి ఓటు మిస్ కాకుండా, ఎలాంటి తప్పుల్లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేసే బాధ్యత బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లపై ఉందన్నారు.

కలెక్టరేట్ అధికారులు సైతం మండలాల వారీగా డేటాను క్రాస్ చెక్ చేస్తున్నారని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారంలో డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు ఒక్క చోటే దరఖాస్తు చేస్తున్నాం అని సంతకం చేస్తారని గుర్తుచేశారు. ఒకవేళ కావాలని డూప్లికేట్ ఫారాలు సమర్పించినా, తప్పుడు వివరాలు ఇచ్చినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణుమాధవ్ రావు తాసిల్దార్ సాయి గౌడ్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు