Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Srisailam : శ్రీశైలం నిండుతోంది.. నీటిమట్టం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాషయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Srisailam : శ్రీశైలం నిండుతోంది.. నీటిమట్టం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి : వెబ్ డెస్క్ :

కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాషయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను శుక్రవారం ఉదయం నాటికి 873.20 అడుగులకు చేరింది.

అదేవిధంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 168.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేశారు. మరో మూడు రోజుల్లో శ్రీశైలంకు ప్రాజెక్టు నిండుకుండలా జలకళ సంతరించుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు