Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. మోతే మండల కేంద్రంలో భార్య భర్తల హత్య..!
సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్ర సమీపంలో భార్యాభర్త హత్య కలకలం సృష్టిస్తుంది. భార్యాభర్తల ఇద్దరిని హత్య చేసి భూమిలో పాతిపెట్టిన సంఘటన చోటుచేసుకుంది.

Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. మోతే మండల కేంద్రంలో భార్య భర్తల హత్య..!
సూర్యాపేట (మోతే ), మనసాక్షి :
సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్ర సమీపంలో భార్యాభర్త హత్య కలకలం సృష్టిస్తుంది. భార్యాభర్తల ఇద్దరిని హత్య చేసి భూమిలో పాతిపెట్టిన సంఘటన చోటుచేసుకుంది. మోతే మండలం బీక్యా తండాకు చెందిన హలవత్ నాగు, బూబా లు భార్యాభర్తలు పొట్టకూటికోసం మోతే మండల కేంద్రానికి వచ్చి కొంత భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేసుకుంటూ రెండు సంవత్సరాలుగా మోతే మండల కేంద్రంలోని నివాసం ఉంటున్నారు.
రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తల మీద కొట్టి వారిని హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి పాతిపెట్టినట్టుగా ఆనవాళ్లు ఉన్నట్లు ఎస్పీ నర్సింహా తెలిపారు. ఉదయాన్నే అటు గా వెళ్తున్న రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ పర్యవేక్షణ లో సంఘటన స్థలాన్ని చేరుకొని ఆనవాళ్లు గుర్తించారు.
పాతిపెట్టిన మృతదేహాలు బయటకు తీసిన తర్వాత అక్కడ ఉన్న తండాకు చెందిన వాసులు తమ తండావాసులు గా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీస్ లు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చెస్తున్నారు.










