Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Breaking News : మన సాక్షి టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

వెబ్ న్యూస్ లో ఎప్పటికప్పుడు బ్రేక్ న్యూస్ మీకోసం అందిస్తుంది.. స్థానికం నుంచి జాతీయం, అంతర్జాతీయం వరకు బ్రేకింగ్ న్యూస్..

Breaking News : మన సాక్షి టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి :

వెబ్ న్యూస్ లో ఎప్పటికప్పుడు బ్రేక్ న్యూస్ మీకోసం అందిస్తుంది.. స్థానికం నుంచి జాతీయం, అంతర్జాతీయం వరకు బ్రేకింగ్ న్యూస్..

నిజామాబాద్ జిల్లాలో దారుణం :

నిజామాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మోపాల్ మండల కేంద్రంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్లపొదల్లో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. మోపాల్ గురుకుల పాఠశాల పక్కన పసికందును గుర్తించిన స్థానికులు. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. ఆడశిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్య సిబ్బంది.

———

ఆసుపత్రికి వెళ్లేందుకు దారి లేక గర్భిణిని వాగు దాటించిన యువకులు :

కొమురం భీం జిల్లా కెరమెరి మండలానికి చెందిన ఏడు నెలల గర్భిణి కొడప రామేశ్వరికి కడుపునొప్పి రావడంతో ఆమెను ఇద్దరు వ్యక్తులు స్ట్రెచర్‌పై ఉధృతంగా పారుతున్న పెద్దవాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. వాగులపై బ్రిడ్జిలు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో తీవ్ర నరకం అనుభవిస్తున్నామని, ప్రభుత్వం తక్షణమే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ఆసిఫాబాద్ మారుమూల గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

—- —-

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి :

నాగ్‌పూర్‌లోని భరత్‌వాడా చౌక్ వద్ద అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

దీంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మరో యువకుడు.

——-

నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో మహిళకు వేధింపులు :

  • కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఫోటో గ్రాఫర్ అరెస్ట్
  • బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న మహిళపై ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులు
  • నకిలీ అకౌంట్ ద్వారా మహిళను వేధించినట్లు ఆరోపణలు
  • వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
  • ఫోటోగ్రాఫర్ దాసరి రామకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు

——

మానేరు వాగులో కొట్టుకుపోయిన యువకులు :

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ్‌పల్లె వద్ద బైక్‌పై మానేరు వాగు దాటుతూ ఇద్దరు యువకులు వరదలో కొట్టుకుపోయారు. గ్రామస్తులు వెంటనే స్పందించి తాడు సహాయంతో వారిని, బైక్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

మరిన్ని వార్తలు