ఆరుతడి పంటలను సాగు చేయాలి..!
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మండల ప్రత్యేక అధికారి జి శ్రీధర్ రెడ్డి అన్నారు.

ఆరుతడి పంటలను సాగు చేయాలి..!
అర్వపల్లి, మన సాక్షి :
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మండల ప్రత్యేక అధికారి జి శ్రీధర్ రెడ్డి అన్నారు.
గురువారం మండల కేంద్రం లో పెసర పంటను పరిశీలించి మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులు ఉండడం వలన, ఈ సీజన్లో, జొన్నలు, బొబ్బర్లు, మినుములు, ఆముదాలు, కందులు, పంటలను సాగు చేసుకోవాలని అన్నారు. విత్తనాలు కావలసినవారు వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదిస్తే సబ్సిడీపై విత్తనాలను అందించేందుకు అధికారులు సహాయపడతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి పల్లపు ఝాన్సీ, వ్యవసాయ విస్తరణ అధికారి నేరెళ్ల సత్యం, గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి, సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, రైతులు దావుల గోపాల్, సాయిని ఉప్పలయ్య, దావుల నవీన్, బోయపల్లి వీర సోములు, లొడంగి నాగరాజు, పాల్గొన్నారు రైతు దావుల లింగయ్య, పెసర పంటని పరిశీలించారు.