Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : నల్గొండలో రాక్షస రాజ్యం నడుస్తోంది.. అభివృద్ధిపై చర్చకు భూపాల్ రెడ్డి సవాల్..!

నల్గొండ లో రాక్షస రాజ్యం నడుస్తుందని,. నల్గొండ లో కమిషన్ల రాజ్యం నడుస్తుందని, మంత్రి కోమటి రెడ్డి అండతోనే. అరాచకాలు సాగుతున్నాయని నల్గొండ మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు.

Nalgonda : నల్గొండలో రాక్షస రాజ్యం నడుస్తోంది.. అభివృద్ధిపై చర్చకు భూపాల్ రెడ్డి సవాల్..!

నల్గొండ ప్రతినిధి, మన సాక్షి :

నల్గొండ లో రాక్షస రాజ్యం నడుస్తుందని,. నల్గొండ లో కమిషన్ల రాజ్యం నడుస్తుందని, మంత్రి కోమటి రెడ్డి అండతోనే. అరాచకాలు సాగుతున్నాయని నల్గొండ మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్గొండలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ
సిపిఎం ఆఫీస్ పై పోలీసుల దౌర్జన్యం పై తీవ్ర ఖండిస్తున్నట్లు చెప్పారు. మరో రెండు సంవత్సరాలలో నల్గొండ లో ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారని, డబులు బెడ్ రూమ్ ఇండ్ల లో ఒక్కో ఇల్లుకు 3 లక్షల వరకు లంచాలు పుచ్చుకున్నారని ఆరోపించారు.

546 డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల నిర్మాణం కే సి ఆర్ నాయకత్వం లో చేశామని, స్థానిక డివిజన్ లో ప్రజల సమక్షంలో డ్రా తిసాం.. డ్రా లో పేరు వచ్చిన వారికి మాత్రమే ఉంచాం… 431 ఇళ్లకు నాడు డ్రా తిసాం.. మిగతా ఇండ్లకు డి ఈ వో కార్యాలయం దుప్పల పల్లి,నుండీ రోడ్డు వెడల్పు లో ఇల్లు కోల్పోయిన వారికి హామీ ఇచ్చాం అన్నారు.

నాటి కలెక్టర్ ఆధ్వర్యంలో 130 రోడ్డు బాధితులకు సెలక్ట్ చేశాం.. నాడు డ్రా లో వచ్చిన వారిలో 150 మందికి కూడా ఇవ్వలేదన్నారు. ప్రజల నుండీ వచ్చిన, వినతి పత్రాలను కలెక్టర్ పట్టించుకోలేదని, సిపిఎం కార్యాలయం పై పోలీసుల దాడి అమానుషం, సిపిఎం నాయకుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి అరెస్ట్ చేసిన ఎస్సై నీ సస్పెండ్ చేయాలన్నారు.

త్వరలో డిజిపి నీ కలిసి కంప్లెంట్ చేస్తామని, ఇప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అప్రజాస్వామికమని, మల్లి డ్రా తిసి అర్హులకు ఇండ్లు ఇవ్వాలిసినిదే అన్నారు. లేకుంటే మా ప్రభుత్వం వచ్చాక అన్ని రద్దు చేసి మళ్ళీ డ్రా తీస్తాం అన్నారు.

డబ్బులు ఇచ్చినవారు వెంటనే వసూలు చేసుకోండి లేకుంటే తర్వాత నష్టపోతారని, పట్టణం లో ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తుర్రు… అమృత్ స్క్రిం కింద నిధులు దుర్వినియోగం, వెంచర్లలో అమృత్ స్క్రిం సి సి రొడ్లు వేస్తుర్రు అన్నారు. లతీఫ్ సాబ్ గుట్ట కు బఫర్ జోన్ తియలేదని, రానున్న రోజులలలో వెంచర్లపై విజిలెన్స్ వేస్తామని,

బీ ఆర్ ఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశామని, కోమటిరెడ్డి హయాంలో ఒక్క అభివృద్ధి ఫౌండేషన్ వేయాలేదని, 30 ఏళ్లుగా అవకాశం ఇచ్చిన నల్గొండ ప్రజలకు కోమటిరెడ్డి ఎం చేశాడని అన్నారు. అభివృద్ధి పై చర్చకు భూపాల్ రెడ్డి సిద్ధం కోమటిరెడ్డి సిద్ధమా ఆని సవాల్ చేశారు. మర్రిగూడ ప్లై ఓవర్ నిర్మాణం 45 కోట్ల తో కె సి ఆర్ ప్రభుత్వం లో నిర్మాణం చేశారు, ప్రతిష్టాత్మక.. నల్గొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను, తన విలాస వంతమైన జీవితానికి ఇందిరా భవన్ గా మార్చాడన్నారు.

సమావేశంలో రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, రావుల శ్రీనివాసరెడ్డి, మారగోని గణేష్, దేప వెంకట్ రెడ్డి అయితగోని యాదయ్య, కార్పోరేటర్లు పెరిక యాదయ్య పేర్ల అశోక్,రత్నగిరి శ్రీనివాస్ కుందూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, దొడ్డి రమేష్.. జమాల్ ఖాద్రి,మిర్యాల స్వామి ఊటుకూరు సందీప్ రెడ్డి, బడుపుల శంకర్, అన్వర్ పాషా, దండంపెల్లి సత్తయ్య గంజి రాజేందర్, పెండెం ధనుంజయ, నర్ర నిర్మల, రాయల రమేష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

By: Nagireddy, 9666924232

మరిన్ని వార్తలు