Miryalaguda : ఎల్‌నినో ప్రభావం.. రైతులు వర్షాధార పంటలు సాగు చేయాలి..!
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వర్షాధార పంటల సాగు చేయాలని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి మేకల ఋషేంద్రమని కోరారు.

Miryalaguda : ఎల్‌నినో ప్రభావం.. రైతులు వర్షాధార పంటలు సాగు చేయాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వర్షాధార పంటల సాగు చేయాలని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి మేకల ఋషేంద్రమని కోరారు. సోమవారం మిర్యాలగూడ రైతువేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మేకల ఋషేంద్రమని రైతులకు పలు సూచనలు చేశారు. తక్కువ నీటి లభ్యత ఉన్న పరిస్థితుల్లో వరి పంటకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల వర్షాధార పంటలను ప్రోత్సహించాలని సూచించారు. వర్షాధార పరిస్థితులకు అనుగుణంగా కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకాల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు చిరుమర్రి కృష్ణయ్య , సైదులు, రైతులు మోహన్ రెడ్డి, రాఘవ రెడ్డి, ఏ ఈ ఓ మాలవత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
- TS News : సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు కొండ దంపతులు దూరం.. సభలో వారికి షాక్ ఇచ్చిన రేవంత్..!
- CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన.. నిరుద్యోగ యువకుల్లారా.. వారిపట్ల అప్రమత్తంగా ఉండండి..!
- Nalgonda : నల్గొండలో రాక్షస రాజ్యం నడుస్తోంది.. అభివృద్ధిపై చర్చకు భూపాల్ రెడ్డి సవాల్..!
- Srisailam : శ్రీశైలంకు వరద బంద్.. మూసుకుపోయిన ఆల్మట్టి గేట్లు, సాగర్ లో నీటిమట్టం ఎంతంటే..!









