Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

జూరాలకు మళ్లీ వరద.. గేట్లు ఎత్తి విడుదల, శ్రీశైలంకు చేరుతున్న నీరు..!

కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టుకు మళ్ళీ వరద ప్రారంభమైంది. కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాలకు మళ్లీ వరద.. గేట్లు ఎత్తి విడుదల, శ్రీశైలంకు చేరుతున్న నీరు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టుకు మళ్ళీ వరద ప్రారంభమైంది. కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో జూరాల ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కాగా జూరాల ప్రాజెక్టుకు ఆరు గేట్లు ఎత్తి దిగువకు 71 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది.

మరిన్ని వార్తలు