Breaking Newsక్రైంతెలంగాణ
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
సిద్దిపేట జిల్లాలో తీర విషాద ఘటన చోటుచేసుకుంది. కారు బావిలోకి దూసుకెల్లడంతో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
మన సాక్షి :
సిద్దిపేట జిల్లాలో తీర విషాద ఘటన చోటుచేసుకుంది. కారు బావిలోకి దూసుకెల్లడంతో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కొడుకు నిహాన్ష్ (4), కూతురు శాన్విక (2) కారులో సిద్దిపేట నుంచి ఇంటికి వెళ్తుండగా, అప్పనపల్లి శివారులో బావిలోకి కార్ దూసుకెళ్ళింది.
ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కారును బయటికి తీశారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా మరణించడంతో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.









