Breaking Newsఆంధ్రప్రదేశ్
ఏకాంతంగా ఉండేందుకు అడవికి వెళ్ళిన జంట.. చివరికి ఏం జరిగిందంటే..!
ఏకాంతంగా గడిపేందుకు ఓ జంట అటవీ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ జరిగిన సంఘటన చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ఏకాంతంగా ఉండేందుకు అడవికి వెళ్ళిన జంట.. చివరికి ఏం జరిగిందంటే..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
ఏకాంతంగా గడిపేందుకు ఓ జంట అటవీ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ జరిగిన సంఘటన చూస్తే షాక్ అవ్వాల్సిందే. వివరాల ప్రకారం.. కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు వెళ్లారు. ఆ సమయంలో విద్యుత్ తీగలు తగిలి యువకుడు ఫయాజ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది.
వీరు అటవీ ప్రాంతంలో ఉన్న సమయంలో యువతి యువకుడికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో గట్టిగా కేకలు పెట్టారు. కేకలు విని గొర్రెల కాపరులు దగ్గరికి చేరుకొని ప్రమాదం నుంచి రక్షించారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.









