Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : 50 గజాలు.. ఏడు అంతస్తులు.. పేక మేడలా కూలిన భవనం.. హైదరాబాదులో ఘటన..!

50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం నిర్మాణం పేక మేడలా కూలింది. ఈ ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad : 50 గజాలు.. ఏడు అంతస్తులు.. పేక మేడలా కూలిన భవనం.. హైదరాబాదులో ఘటన..!

మన సాక్షి, హైదరాబాద్ :

50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం నిర్మాణం పేక మేడలా కూలింది. ఈ ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కేవలం 50 గజాల స్థలంలో నాలా ఆనుకొని ఉన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం నిట్ట నిలువునా కూలింది. ఆ సమయంలో భవనంలో టైల్స్ పనులు చేస్తున్న ఇద్దరు బిహారీ కార్మికులు శిథిలాల కింద పడి దుర్మరణం పాలయ్యారు.

ఈ ఘటన ఐటీ కార్రిడార్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్య నగర్ లో చోటుచేసుకుంది. సర్వేనెంబర్ 135 ప్లాట్ నెంబర్ 113 లో నిర్మాణంలో ఉన్న పవను శనివారం ఉదయమే రెండు అంతస్తులు కుంగడంతో అందులో నిర్మాణంలో ఉన్న ఐదు ఫ్యామిలీ లను తరలించారు. అయినా కూడా ఆ భవనంలో ఇంకా పనులు చేపడుతున్నారు. కాగా అక్రమ నిర్మాణం తో పాటు నాసిరకం నిర్మాణం వల్ల ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

శిధిలాలలో చిక్కుకున్న బిహారి కార్మికులు ఉమేష్ కారే (34) మోపత్ (42) మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భవన యజమాని సాధిక్ గా పోలీసులు గుర్తించి అతనిఅడిపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇతనికి మరో రెండు మూడు భవనాలు కూడా ఉన్నాయని వాటిని కూడా ఇదే విధంగా అక్రమంగా నిర్మాణాలు, నాసిరకంగా నిర్మాణాలు చేపట్టి హాస్టల్ కు అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తుంది.

ప్రమాద స్థలాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ పరిశీలించారు. అతనితోపాటు సిఎంసి కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, తాసిల్దార్ మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అంజయ్య నగర్ లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టే అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు