TG News : అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు.. కొండ సురేఖకు వ్యతిరేకంగా సమావేశమైన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!
కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత వివాదం మొదలైందని చెప్పవచ్చును. మంత్రి కొండ సురేఖ కూతురు సుస్మిత ఏకంగా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం, అధిష్టానం నోటీసులు ఇవ్వడంతో వివాదం మొదలైంది.

TG News : అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు.. కొండ సురేఖకు వ్యతిరేకంగా సమావేశమైన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత వివాదం మొదలైందని చెప్పవచ్చును. మంత్రి కొండ సురేఖ కూతురు సుస్మిత ఏకంగా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం, అధిష్టానం నోటీసులు ఇవ్వడంతో వివాదం మొదలైంది. సుస్మిత తో పాటు కొండ సురేఖకు అధిష్టానం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో కొండ సురేఖ తన కూతురు మాట్లాడిన మాటలకు తనకేంటి సంబంధం అని వివరణ ఇచ్చిన విషయం తెలిసింది.
కాగా కొండ సురేఖకు సంబంధం లేకపోయినా ఆమె కనీసం ఆమె కూతురు వ్యాఖ్యలను ఖండించాలి కదా అంటూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం సమావేశమయ్యారు. వారు మీడియాతో మాట్లాడుతూ కొండ సురేఖ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నదని, పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలంటూ ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో విధంగా మాట్లాడారు.
కొండా సురేఖ తో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడని, అదేవిధంగా చిన్నారెడ్డి కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఎమ్మెల్యేలు వారిపై విరుచుక పడ్డారు. ఈ తతంగమంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు రెండు వర్గాలుగా చీలే అవకాశం ఉంది.
కొండా సురేఖను సస్పెండ్ చేయాలని ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరే :
నాయిని రాజేందర్ రెడ్డి
కేఆర్ నాగరాజు
బీర్ల ఐలయ్య
మధుసూదన్ రెడ్డి
రేవూరి ప్రకాష్ రెడ్డి
దొంతి మాధవరెడ్డి
మందుల సామెల్
వెడ్మ బొజ్జు
వేముల వీరేశం
బుయ్యని మనోహర్ రెడ్డి
కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
బత్తుల లక్ష్మా రెడ్డి
బాలు నాయక్
వీర్లపల్లి శంకర్
కుంభం అనిల్ కుమార్ రెడ్డి
చిక్కుడు వంశీకృష్ణ
బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ
బస్వరాజు సారయ్య ఎమ్మెల్సీ









