Hyderabad : నకిలీ వైద్యుల గుట్టు రట్టు.. 11 మంది నకిలీ వైద్యుల అరెస్టు..!
హైదరాబాద్ మహానగరంలో టాస్క్ ఫోర్స్, సిటీ పోలీసులు నకిలీ వైద్యుల గొట్టురట్టు చేశారు. 11 మంది నకిలీ వైద్యులను అరెస్టు చేశారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు.

Hyderabad : నకిలీ వైద్యుల గుట్టు రట్టు.. 11 మంది నకిలీ వైద్యుల అరెస్టు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
హైదరాబాద్ మహానగరంలో టాస్క్ ఫోర్స్, సిటీ పోలీసులు నకిలీ వైద్యుల గొట్టురట్టు చేశారు. 11 మంది నకిలీ వైద్యులను అరెస్టు చేశారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో సిటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి వైద్య విద్య గుర్తింపు అర్హత లేకుండా డిగ్రీలు లేకపోయినా పెద్దపెద్ద ప్రెస్క్రిప్షన్లు రాస్తూ ఇంజక్షన్లు యాంటీబ్యాక్టిక్స్ ఇస్తూ సామాన్యులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ప్రైవేట్ క్లినిక్ లు నడపడంతో పాటు మరికొందరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పేర్లను వాడుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి క్లినిక్ ల నుంచి భారీ ఎత్తున నకిలీ లెటర్ హెడ్లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హత లేని వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
MOST READ :
- Big Breaking : శ్రీశైలంలో తీవ్ర విషాదం.. ప్రైవేటు సత్రంలో ఐదుగురు ఆత్మహత్య..!
- ఆక్రమణకు చెక్.. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన షెడ్డు కూల్చివేత..!
- Suryapet : తీసుకునేది ఎక్కువ ధర.. బిల్లులో తక్కువ ధర.. సూర్యాపేట జిల్లాలో యాదేచ్చగా యూరియా విక్రయాలు..!
- శ్రీశైలం, నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. లేటెస్ట్ అప్డేట్..!