Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : రాఖీ పండుగ వేళ.. ప్రయాణికుల రద్దీపై ఆర్టీసీ ప్రత్యేక నిఘా..!

రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని కరీంనగర్ బస్ స్టేషన్‌లో ప్రయాణీకుల రద్దీని, బస్సుల అందుబాటును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజనల్ మేనేజర్ బి. రాజు స్వయంగా పర్యవేక్షించారు.

Karimnagar : రాఖీ పండుగ వేళ.. ప్రయాణికుల రద్దీపై ఆర్టీసీ ప్రత్యేక నిఘా..!

కరీంనగర్, మనసాక్షి:

రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని కరీంనగర్ బస్ స్టేషన్‌లో ప్రయాణీకుల రద్దీని, బస్సుల అందుబాటును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజనల్ మేనేజర్ బి. రాజు స్వయంగా పర్యవేక్షించారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎన్. భూపతిరెడ్డితో కలిసి ఆయన బస్ స్టేషన్‌లో ఉండి అన్ని రూట్లలోని ప్రయాణీకుల రాకపోకలను పరిశీలించారు.

ఈ క్రమంలో కరీంనగర్ – 1 మరియు కరీంనగర్ – 2 డిపోలను సందర్శించిన ఆయన, ప్రయాణీకుల సౌకర్యార్థం డిపోల్లోని అన్ని బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు. బస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్లియరెన్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని డిపో మేనేజర్లు ఇ. విజయమాధురి, ఎం. శ్రీనివాస్‌లకు సూచించారు. ఈ పర్యవేక్షణలో కరీంనగర్ జోన్ సెక్యూరిటీ అధికారి టి. భావ్‌రావు కూడా పాల్గొన్నారు.

పండుగ వేళ ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో నిరంతరం విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర సిబ్బందికి రీజనల్ మేనేజర్ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందజేశారు. ప్రయాణీకులందరూ భద్రతతో కూడిన సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి 

మరిన్ని వార్తలు