Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణపండుగలురాజకీయం

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ.. అనంతరం ఏమన్నారంటే.!

మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె తొలిసారిగా రాఖీ కట్టారు.

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ.. అనంతరం ఏమన్నారంటే.!

మన సాక్షి, హైదరాబాద్ :

మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆమె తొలిసారిగా రాఖీ కట్టారు. మరో మంత్రి సీతక్క తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆయన అల్లుడు, ఆయన మనవడికి కూడా రాఖీ కట్టారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా బంగారంతో చేయించిన రాఖీ అని పేర్కొన్నారు. ఆమె అందరికీ సోదరిని అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి మూడోసారి రాఖీ కట్టినట్లు చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. ముఖ్యమంత్రి మంచి పరిపాలన చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

MOST READ 

మరిన్ని వార్తలు