Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్.. మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే..!

ఖైరతాబాద్ డబల్ బెడ్ రూమ్ లక్కీ డ్రా లో ప్రోటోకాల్ వివాదం నెలకొన్నది. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్.. మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే..!

మన సాక్షి, హైదరాబాద్ :

ఖైరతాబాద్ డబల్ బెడ్ రూమ్ లక్కీ డ్రా లో ప్రోటోకాల్ వివాదం నెలకొన్నది. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం బంజారాహిల్స్ కొమరం భీమ్ ఆదివాసి భవన్ లో ఖైరతాబాద్ గృహ లక్ష్మీ లబ్ధిదారులకు ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ లక్కీ డ్రా లో పాల్గొని లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యే రాకముందే అధికారులు లక్కీ డ్రా ప్రారంభించారు. దాంతో ఎమ్మెల్యే వచ్చాక అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వచ్చేలోపే గృహలక్ష్మి లక్కీ డ్రా ఎలా ప్రారంభిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే అంటే అధికారుల గౌరవం లేకుండా పోయింది. సిగ్గుండాలి.. ఎమ్మెల్యే వచ్చేవరకు ఆగలేరా.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబల్ బెడ్ రూమ్ ప్లాట్ ల కోసం అప్లై చేసిన అందరికీ ప్లాట్లు రాకపోతే అధికారులకు గల పట్టి ఇప్పిస్తా అంటూ.. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల తీరుపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు.

 ఈ వార్తలు కూడా చదవండి 

మరిన్ని వార్తలు