Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

బావి అంచున వేలాడిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ సమయస్పూర్తి..!

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు కొంతమంది ప్రయాణికులతో వెళ్తుండగా, బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది.

బావి అంచున వేలాడిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ సమయస్పూర్తి..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు కొంతమంది ప్రయాణికులతో వెళ్తుండగా, బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో బస్సు పూర్తిగా బావిలో పడిపోకుండా రక్షణ గోడపైనే నిలిచిపోయింది.

దీంతో బస్సులోని ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను వెనుక వైపు నుండి కిందకు దించి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. త్రుటిలో ఇంతటి భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

MOST READ

మరిన్ని వార్తలు