Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన..!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది.

ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అనంతపురం జిల్లా మిడుతూరు వద్ద ఎన్.హెచ్ 44 పై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం లేకుండా క్షేమంగా బయటపడగలిగారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు