పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన అలేఖ్య..!
అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామానికి చెందిన గంగనోళ్ల అలేఖ్య ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంబిబిఎస్ సీట్ సాధించింది.

పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన అలేఖ్య..!
అందోల్ (జోగిపేట), మనసాక్షిః
అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామానికి చెందిన గంగనోళ్ల అలేఖ్య ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంబిబిఎస్ సీట్ సాధించింది. తండ్రి చిన్నప్పుడే అనారోగ్యంతో మరణించినా పట్టుదలతో తండ్రి కోరికను తీర్చేందుకు కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటును సాధించింది అలేఖ్య. గ్రామంలోని నిరుపేద కుటుంబానికి విద్యార్థి ప్రతిభ కనబరచడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని గంగనోళ్ల లక్షీ్మ – అర్జునయ్య ల కుమార్తె ప్రభుత్వ రెసిడెన్సియల్ కళాశాలలో చదువుతూ మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ సీటు సాధించింది. గౌలిదొడ్డి రెసిడెన్సియల్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యస్తూనే నీట్ పరీక్ష ప్రిపేర్ అయ్యి మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ కాలేజీలో సీటు సంపాదించుకుంది. ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ ఎంబిబిఎస్ చదవడం తన తండ్రి చిరకాల కోరిక అన్నారు. చిన్నతనంలో తాను 4వ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్న చనిపోయారని ఆమె అన్నారు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు పట్టుదలతో చదివి తండ్రి కోరికను తీర్చానని తెలిపింది. చదువుకు పేదరికం అడ్డు కాదని ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.










