Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం మంగళవారం గొడకొండ్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ కాశగోని వెంకటయ్య అందజేశారు.

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
చింతపల్లి, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం మంగళవారం గొడకొండ్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ కాశగోని వెంకటయ్య అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ కంప్యూటర్ డిజిటల్ కార్డులను అందజేయడం జరుగుతుందన్నారు.
ప్రతి ఒక్క లబ్ధిదారుడు కార్డును భద్రపరచుకొని రేషన్ సరుకులు తీసుకోవాలన్నారు. ఈ స్మార్ట్ కార్డులో ఇంట్లో ఉన్న అందరి పేర్లు నమోదు చేపడుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళీమోహన్, వీఆర్ఏ పుల్లయ్య,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









