మల్కాజిగిరి జోనల్ కార్యాలయం ముందు క్రికెట్ ఆడుతూ వినూత్న నిరసన.. ఎందుకంటే..!
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడాన్ని నిరసిస్తూ మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ వినూత్న నిరసన చేపట్టారు.

మల్కాజిగిరి జోనల్ కార్యాలయం ముందు క్రికెట్ ఆడుతూ వినూత్న నిరసన.. ఎందుకంటే..!
మేడ్చల్ మల్కాజిగిరి, మన సాక్షి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడాన్ని నిరసిస్తూ మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ వినూత్న నిరసన చేపట్టారు. కార్యాలయంలో ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో పిల్లల బ్యాటు, బంతితో కార్యాలయం ప్రాంగణంలో క్రికెట్ ఆడి తన నిరసనను వ్యక్తం చేశారు.
ప్రజలకు ఉపయోగపడని విధంగా అధికారులు అందుబాటులో లేని కార్యాలయాన్ని కొనసాగించడం కంటే మూసివేయడం మంచిదని శ్రవణ్ వ్యాఖ్యానించారు. అధికారులు ఎస్‌ఐఆర్ పేరుతో ప్రజలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే తదుపరి దశలో సచివాలయం ముందు క్రికెట్ ఆడి నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వేణుగోపాల్ యాదవ్, శ్రీధర్, వెంకట్ రెడ్డి, ఏఎస్ రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









