రైతులకు బిగ్ అలర్ట్.. అందరూ ఇలా చేయాల్సిందే.. లేదంటే ప్రభుత్వ పథకాలు అందవు..!
రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రుషేంద్రమని కోరారు. మిర్యాలగూడ రైతువేదికలో శుక్రవారం రైతులకు రైతు రిజిస్ట్రేషన్, పంటల మార్పిడి మరియు వరి పంటలో పురుగులు, తెగుళ్ల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

రైతులకు బిగ్ అలర్ట్.. అందరూ ఇలా చేయాల్సిందే.. లేదంటే ప్రభుత్వ పథకాలు అందవు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రుషేంద్రమని కోరారు. మిర్యాలగూడ రైతువేదికలో శుక్రవారం రైతులకు రైతు రిజిస్ట్రేషన్, పంటల మార్పిడి మరియు వరి పంటలో పురుగులు, తెగుళ్ల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రైతు రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వ పథకాలు, పంటల కొనుగోలు, పంట రుణాలు, బీమా మరియు ఇతర వ్యవసాయ సేవలు పొందేందుకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడి, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించుకోవాలని సూచించారు. వరి స్థానంలో కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయడం ద్వారా నీటి పొదుపుతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడి, సాగు నష్టాల ప్రమాదం తగ్గుతుందని వివరించారు.
అలాగే వరి పంటలో పురుగులు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి, వ్యవసాయ శాఖ సూచించిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. అవసరం లేని పురుగుమందుల వినియోగాన్ని నివారించి, శాస్త్రీయ పద్ధతుల్లో పంటల యాజమాన్యం చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిటిఎం గిరి, ఏఈవో మలావత్ రమేష్ మిర్యాలగూడ మండలం పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.