తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభను విజయవంతం చేయండి..!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభను విజయవంతం చేయండి..!
చింతపల్లి మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వందనపు ఆంజనేయులు
చింతపల్లి, మనసాక్షి :
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈనెల 13న ఆదివారం హైదరాబాదులో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ బగాయత్ లో
కేటాయించిన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం, నిర్మాణం భూమి పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని, అదేవిధంగా శ్రీనివాస కళ్యాణం జరపబడుతుందని
చింతపల్లి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వందనపు ఆంజనేయులు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు ఊరే లక్ష్మణ్ లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆర్యవైశ్యుల సమ్మేళ కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమానికి ఉదయం 8 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు వారు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ విధిగా ప్రతి ఒక్కరు హాజరైఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ ఆర్యవైశ్య మహాసభకు చింతపల్లి మండలం నుండి ర్యాలీగా ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గ నుండి వేలాదిగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు..









