Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. దానం నాగేందర్ పై అనర్హత వేటు..!

పార్టీ ఫిరాయింపుల పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల పిటిషన్ విచారణలో హైకోర్టు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. దానం నాగేందర్ పై అనర్హత వేటు..!

మన సాక్షి, హైదరాబాద్ :

పార్టీ ఫిరాయింపుల పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల పిటిషన్ విచారణలో హైకోర్టు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టింది. స్పీకర్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ తీర్పుతో 2024 ఏప్రిల్ నుంచి ఆయన శాసనసభ్యుడిగా అనర్హతగా గురైనట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

ALSO READUPI : యూపీఐ పేమెంట్స్ కు అలా చేస్తే చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..!

బిఆర్ఎస్ నుంచి గెలిచిన దానం :

2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఆయన బిఆర్ఎస్ కు అధికారికంగా రాజీనామా చేయకుండా 2024 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫారంపై పోటీ చేయడం వివాదాస్పదంగా మారింది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు వచ్చాయి.

ALSO READరైతులకు బిగ్ షాక్.. అలా చేయకుంటే బ్యాంకు ఖాతాల్లోకి రూ.6000 రానట్లే..!

దానం పై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు :

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కాగా విచారణ చేపట్టిన స్పీకర్ దానం నాగేందర్ చట్టబద్ధంగా పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేశారు. అయితే స్పీకర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత స్పీకర్ నిర్ణయం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. దానం నాగేందర్ పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది.

మరిన్ని వార్తలు