సాయం చేయబోతే ప్రాణమే పోయింది.. నల్గొండ జిల్లాలో ఘటన..!
సహాయం చేయబోతే ప్రాణం పోయింది. భార్య బిడ్డలు వద్దంటున్నా కూడా సహాయం చేసేందుకు వెళ్లాడు. కానీ రోడ్డు ప్రమాదంలో వారి కళ్ళ ఎదుటే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఈ ఘటన జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరయ్యారు.

సాయం చేయబోతే ప్రాణమే పోయింది.. నల్గొండ జిల్లాలో ఘటన..!
మిర్యాలగూడ, మన సాక్షి :
సహాయం చేయబోతే ప్రాణం పోయింది. భార్య బిడ్డలు వద్దంటున్నా కూడా సహాయం చేసేందుకు వెళ్లాడు. కానీ రోడ్డు ప్రమాదంలో వారి కళ్ళ ఎదుటే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఈ ఘటన జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరయ్యారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రావు అతని భార్య అన్నపూర్ణ తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరుతున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు క్రాసింగ్ వద్దకు రాగానే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి బొల్లెపల్లి వెంకటేశ్వర్లు బైక్ స్కిడ్ కావడంతో కింద పడిపోయాడు. గురువారం అర్దరాత్రి జరిగిన ఈ సంఘటన చూసి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని అంబులెన్స్ కు చెప్పి సహాయం చేయడానికి తన కారును ఆపి శ్రీనివాస్ రావు వెళ్ళాడు.
ALSO READ : Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టాంకర్ బీభత్సం.. ఒకరి మృతి..!
కారును రోడ్డు పక్కకు ఆపి 108కు సమాచారం అందించాడు. క్షతగాత్రుని 108 వాహనంలోకి ఎక్కిస్తుండగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎల్పిజి గ్యాస్ టాంకర్ అతివేగంగా బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొట్టడంతో పాటు అంబులెన్స్ సైతం ఢీకొట్టింది. ఈ క్రమంలో శ్రీనివాసు రావు (36) పైనుంచి లారీ వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సహాయం కోసం వెళ్లిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందడంతో అతని భార్య పిల్లలు బోరున విలపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.