Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Paddy : వరిలో చీడపీడల నివారణకై రైతులు ఇలా చేయాలి..!

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరి పంటలో ఆకుముడత, సుడుపురుగు, దోమపోటు (బిపిహెచ్) వంటి చీడపీడలు ఉధృతమయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి (ఎంఎఓ)మేకల రుషేంద్రమణి సూచించారు.

Paddy : వరిలో చీడపీడల నివారణకై రైతులు ఇలా చేయాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరి పంటలో ఆకుముడత, సుడుపురుగు, దోమపోటు (బిపిహెచ్) వంటి చీడపీడలు ఉధృతమయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి (ఎంఎఓ)మేకల రుషేంద్రమణి సూచించారు. శనివారం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో వరి పొలాలు సందర్శించిన సందర్భంగా రైతులతో మాట్లాడుతూ తమ పొలాలను రైతులు తరచూ పరిశీలిస్తూ ఆకులపై తెల్లటి గీతలు, ఆకులు ముడుచుకోవడం, పురుగుల ఉనికి వంటి లక్షణాలను గమనించాలని తెలిపారు.

ALSO READ గణేష్ నిమజ్జనం ముగించుకొని వెళ్తుండగా  ఘోర రోడ్డు ప్రమాదం.. ఓకే కుటుంబంలో నలుగురు మృతి..! 

పురుగుల ఉధృతిని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పురుగుల నియంత్రణకు కాంతి బుట్టలు (లైట్ ట్రాప్స్ ) ఏర్పాటు చేసుకోవడంతో పాటు, లద్దెపురుగు, ఆకుముడత నివారణకు ఎకరాకు 4–5 లింగాకర్షక బుట్టలు (ఫేరోమోన్ ట్రాప్స్ ) ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

ALSO READసాయం చేయబోతే ప్రాణమే పోయింది.. నల్గొండ జిల్లాలో ఘటన..!

పురుగుల ఉధృతి ఆర్థిక నష్ట స్థాయి (ఇటిఎల్) దాటినప్పుడు మాత్రమే వ్యవసాయ అధికారుల సూచన మేరకు సిఫారసు చేసిన పురుగుమందులను ఉపయోగించాలని, అనవసరంగా రసాయన మందులను పిచికారీ చేయవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఎఇఓ నాగయ్య, రైతులు కృష్ణారెడ్డి, పుల్లయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు