Narayanpet : ఆకట్టుకున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీ..!
నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థుల చేత నిర్వహించిన మాక్ అసెంబ్లీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతగానో అబ్బుర పరిచింది. విద్యార్థులే గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే పాత్రలు పోషించి నిజమైన అసెంబ్లీని తలపించారు.

Narayanpet : ఆకట్టుకున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీ..!
నారాయణపేట, మన సాక్షి :
నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థుల చేత నిర్వహించిన మాక్ అసెంబ్లీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతగానో అబ్బుర పరిచింది. విద్యార్థులే గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే పాత్రలు పోషించి నిజమైన అసెంబ్లీని తలపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సభ్యులు ఘాటుగా ప్రశ్నించగా, ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రులు సూటిగా జవాబులతో అబ్బురపరిచారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురా లు భారతి ఆధ్వర్యంలో జరిగిన ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి బాలాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ నైపుణ్యం ఎంతో అభినందనీయమని వారిని ప్రోత్సహించిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నరసింహ,
ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.
విద్యార్థుల్లో ప్రజాస్వామ విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో దాగిన ప్రతిభ వెలికితీయడానికి ఇది చక్కని అవకాశం అని పేర్కొన్నారు.
గవర్నర్ గా లావణ్య, స్పీకర్ గా చైతన్య, ముఖ్యమంత్రిగా త్రివేణి, ఉప ముఖ్యమంత్రిగా అక్షయ మంత్రులుగా రాకేష్, నితిన్, 50 మంది విద్యార్థులు ఎమ్మెల్యేలు పాత్రలు పోషించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు సంగీత రాములు, లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి వార్డు సభ్యులు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మణెమ్మ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నయ్యుమ్, సోషల్ ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవికుమార్, కనకప్ప,
గ్రామంలోని పాఠశాలల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.











