రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు.. నిమ్స్ అడిషనల్ సూపరిండెంట్ కు రిమాండ్..!
హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ అడిషనల్ సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా దాడుల అనంతరం ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అతడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు.

రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు.. నిమ్స్ అడిషనల్ సూపరిండెంట్ కు రిమాండ్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ అడిషనల్ సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా దాడుల అనంతరం ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అతడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. దాంతో న్యాయమూర్తి అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం భద్రత సిబ్బంది అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఉన్నతాధికారి హోదాను అడ్డం పెట్టుకొని భారీగా అక్రమార్చనకు పాల్పడ్డారనే పక్క సమాచారంతో ఏసీబీ అధికారులు డాక్టర్ లక్ష్మీ భాస్కర్ తో పాటు ఆయన బంధువులు, బినామీ నివాసాలలో కూడా ఏకంగా 7 చోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ కీలక ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగా స్థిర, చరస్తులు డాక్యుమెంట్లు ఉన్నట్లు ఎసిబి గుర్తించింది.
బినామీ పేర్లతో ఉన్న మరిన్ని బ్యాంకు ఖాతాల్లో లాకర్లను కూడా తెరిచి పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నా రనే సమాచారం. నిందితుడిని కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.
MOST READ :
- భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన సెక్రెటరీగా పల్లపు గోవర్ధన్..!
- ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బిఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్.. పోటీలో ఎవరెవరున్నారంటే..!
- District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి..!
- Miryalaguda : ఫీజుల బకాయిలు, రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఎమ్మెల్సీకి వినతి..!









