Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
ధైర్యపురి తండ లడ్డు వేలం పాట రూ.1.26 లక్షలు.. దక్కించుకున్న సర్పంచ్. వాంకుడవత్ అనిత దాస్..!
చింతపల్లి మండల పరిధిలోని ధైర్యపూరి తండా లో గత తొమ్మిది రోజుల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు అందించారు.

ధైర్యపురి తండ లడ్డు వేలం పాట రూ.1.26 లక్షలు.. దక్కించుకున్న సర్పంచ్. వాంకుడవత్ అనిత దాస్..!
చింతపల్లి, మనసాక్షి :
చింతపల్లి మండల పరిధిలోని ధైర్యపూరి తండా లో గత తొమ్మిది రోజుల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు అందించారు. బుధవారం నిమ్మజన శోభయాత్ర సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డు వేలం పాటలో ధైర్యపురి తండా గ్రామానికి చెందిన స్థానిక సర్పంచ్ వాంకుడవత్ అనిత దాస్ 1 లక్ష 26 వేల రూపాయలకు వేలం పాట పాడి తొమ్మిది రోజులు పూజలు అందుకున్న లడ్డును వారు దక్కించుకున్నారు.
అదేవిధంగా గత సంవత్సరం కూడా 79 వేల రూపాయలకు అదే లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో భక్తిశ్రద్ధలతో గణనాథుని ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









