Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : చట్టాలు కాగితాల మీద కాదు.. అమలులో ఉండాలి..!

భారత విద్యార్థి ఫెడరేషన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Miryalaguda : చట్టాలు కాగితాల మీద కాదు.. అమలులో ఉండాలి..!

మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

మిర్యాలగూడ, మన సాక్షి :

భారత విద్యార్థి ఫెడరేషన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. 80 ఏళ్ల స్వాతంత్రం భారతదేశంలో రోజురోజుకూ మహిళలకు రక్షణ కరువవుతోందని అన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్న పరిస్థితి దేశంలో కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు.

Also Read : బాలాపూర్ లడ్డు రూ.39 లక్షలకు దక్కించుకున్న సామా ప్రణీత్ రెడ్డి..!

ఇటీవల బీహార్‌లో మైనర్ బాలికపై జరిగిన దాడి, ఢిల్లీలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖనిలో మహిళపై జరిగిన హత్య ఘటన కూడా కలవరపరిచిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన “బేటీ బచావో.. బేటీ పడావో” నినాదం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, మహిళలు మరియు బాలికలకు భద్రత కల్పించేలా ఆచరణలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మహిళా రక్షణ చట్టాలను, సంబంధిత ప్రత్యేక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా రక్షణ చట్టాలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.

Also Read : స్వీట్ హౌస్, రెస్టారెంట్లు మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు మూడవత్ జగన్ నాయక్ ,రెమడాల లోహి, గంగోత్రి, సమీర్ బన్ని, కల్పన, రాధిక, కళ్యాణి, మంజుల, కళ్యాణి తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు