Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన సర్పంచ్..!
చిలుకూరు మండల పరిధిలోని దూదియా తండా గ్రామ లో ఆదివారం స్థానిక సర్పంచ్ లావూరి రమాదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన సర్పంచ్..!
మన సాక్షి, చిలుకూరు :
చిలుకూరు మండల పరిధిలోని దూదియా తండా గ్రామ లో ఆదివారం స్థానిక సర్పంచ్ లావూరి రమాదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత సులభంగా రేషన్ సేవలు అందనున్నాయని పేర్కొన్నారు. ఈ
కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.









