Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంతెలంగాణవ్యవసాయం

రైతులకు బిగ్ అలర్ట్.. ఆ గడ్డి మందు అమ్మకాలు నిషేధం..!

కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రజలు ప్రాణాలకు ముప్పుగా మారిన పారక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు కొత్త రిజిస్ట్రేషన్ పై నిషేధం విధించింది.

రైతులకు బిగ్ అలర్ట్.. ఆ గడ్డి మందు అమ్మకాలు నిషేధం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రజలు ప్రాణాలకు ముప్పుగా మారిన పారక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు కొత్త రిజిస్ట్రేషన్ పై నిషేధం విధించింది. ఇప్పటికే ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22వ తేదీన జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెలిపింది.

పారక్వాట్ కేవలం కలుపు నివారణ మందు మాత్రమే కాదని మానవ ఆరోగ్యం పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని చాలాకాలంగా ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీనికి నిర్దిష్ట విరుగుడు లేకపోవడం తీవ్ర విషతుల్యమైన ఉండటం ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు, ప్రజాసంఘాలు, రైతులు అనేక పర్యాయాలు హెచ్చరించారు. దీని ద్వారా నేల, నీరు కలుషితం అవుతున్నాయని, భూసారంపై ప్రభావం పడుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : Suryapet : సూర్యాపేట జిల్లా మోతే వద్ద బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్..!

తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశం మరింత తీవ్రంగా చర్చనీయాంశమైంది. మార్చి 30వ తేదీన తెలంగాణ శాసనసభ లో పారక్వాట్ గడ్డి మందు పై కేంద్రం సంపూర్ణ నిషేధం విధించాలని కోరుతూ తీర్మానం కూడా చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు విక్రయం నిల్వ పంపిణీ తయారీ వినియోగం పై కూడా తాత్కాలికంగా నిషేధం విధించింది.

నిపుణుల కమిటీ రిజిస్ట్రేషన్ కమిటీ సిఫారసులను పరిశీలించిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కమిటీ ఆ సర్టిఫికెట్లను వెనక్కి తీసుకోవాలని, తిరిగి ఇవ్వని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.

మరిన్ని వార్తలు