మిర్యాలగూడ డిపో ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. 15 తులాల బంగారం మాయం..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ డిపో కు చెందిన బస్సులో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం చోటుచేసుకుంది.

మిర్యాలగూడ డిపో ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. 15 తులాల బంగారం మాయం..!
మన సాక్షి, సూర్యాపేట :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ డిపో కు చెందిన బస్సులో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి మిర్యాలగూడ కు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ కావడం వల్ల మహిళలు భారీగా ఉన్మారు. కాగా హుజూర్నగర్ కు చెందిన పద్మావతి, సూర్య ప్రకాష్ దంపతులు కోదాడలో రంగా థియేటర్ బస్టాప్ వద్ద మిర్యాలగూడ డిపో చెందిన బస్సు ఎక్కారు. 15 తులాల బంగారం ఉన్న బ్యాగుతో వారు ఆ బస్సు ఎక్కారు.
కాగా ప్రయాణికుల్లో కలిసిపోయిన దొంగలు బ్యాగులోని బంగారం ను చోరీ చేశారు. దంపతులు గమనించుకోలేక గమ్యస్థానానికి చేరిన తర్వాత చూసుకున్నారు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోదాడలోని బస్టాండ్ తో పాటు రంగా థియేటర్ వద్ద ఉన్న బస్టాప్ సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు బోరున విలపిస్తున్నారు.









