Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరంగారెడ్డి

24 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు రాక.. బిగ్ ట్విస్ట్ ఏంటంటే..!

24 సంవత్సరాల పాటు కన్న కొడుకు ఆచూకీ కోసం ఆ దంపతులు ఎదురు చూశారు. వారు వెతకని చోటు లేదు. చివరికి ఆశలు వదులుకున్నారు.

24 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు రాక.. బిగ్ ట్విస్ట్ ఏంటంటే..!

మన సాక్షి, ఇబ్రహీంపట్నం :

24 సంవత్సరాల పాటు కన్న కొడుకు ఆచూకీ కోసం ఆ దంపతులు ఎదురు చూశారు. వారు వెతకని చోటు లేదు. చివరికి ఆశలు వదులుకున్నారు. ఆ సమయంలోనే ఏళ్ల తరబడి కనిపించని కొడుకు ఆచూకీ లభ్యం కావడంతో వృద్ధ దంపతులకు ఆశ కలిగింది. పట్టరాని సంతోషం లో ఉన్నారు.

అందులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. వృద్ధ దంపతులను నమ్మించి వారి ఆస్తిపై కన్నేసి కుట్ర చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లోని సీతారాంపేటకు చెందిన రాములమ్మ – లక్ష్మారెడ్డి దంపతుల కుమారుడు శ్రీనివాస్ రెడ్డి 19 సంవత్సరాల వయసులో తప్పిపోయాడు. ఇప్పటి వరకు అతనికి ఆచూకీ లభించలేదు. 23 ఏళ్లుగా కుమారుడి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూనే ఉన్నారు.

Also Read : మిర్యాలగూడ డిపో ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. 15 తులాల బంగారం మాయం..!

ఈ విషయం లక్ష్మారెడ్డి బంధువుల ద్వారా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని కొత్తగూడెంకు చెందిన మోహన్ రెడ్డికి తెలిసింది. కొత్తగూడెం కు చెందిన మోహన్ రెడ్డి ఆ వృద్ధ దంపతుల ఆస్తి వివరాలు తెలుసుకొని ఎలాగైనా వారి ఆస్థి కాచేయాలని పక్కా పథకం వేశాడు.

నల్గొండ జిల్లా నకీరేకల్లుకు చెందిన యాదయ్యను సంప్రదించి తప్పిపోయిన శ్రీనివాస్ రెడ్డి గా నటించేందుకు ఒప్పించాడు. ఆ తర్వాత అతని వృద్ధ దంపతుల కుమారుడిగా నమ్మించే ప్రయత్నం చేశాడు. మీ కొడుకు మాలధారణలో ఉన్నాడని అతన్ని సాధారణ స్థితికి తీసుకురావాలంటే సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వారిని నమ్మించాడు.

Also Read : విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

అయితే 23 ఏళ్ల తర్వాత తమ కుమారుడి ఆచూకీ లభించిందని ఆనందంలో వృద్ధ దంపతులు ఉన్నారు. కాగా వారి వ్యవహార శైలి పై బంధువులకు అనుమానం వచ్చింది. దాంతో వారు 10 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. అయితే నకిలీ కుమారుడిగా నటించిన యాదయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. తాను శ్రీనివాస్ రెడ్డిని కాదని అంగీకరించాడు. నకిలీ కుమారుడి వ్యవహారం గుట్టు రట్టయింది. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని అతడిని అరెస్టు చేశారు. ఈ కుట్రలో ప్రధాన పాత్రగా ఉన్న మోహన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు