Breaking Newsజిల్లా వార్తలుమహబూబ్నగర్
మక్తల్ లో గాంధీ జయంతి..!
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మఖ్తల్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి మఖ్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

మక్తల్ లో గాంధీ జయంతి..!
మక్తల్, మనసాక్షి
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మఖ్తల్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి మఖ్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహం, శాంతియుత పోరాటాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటికీ ఆదర్శప్రాయమన్నారు.
నేటి యువత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చిట్టెం రామ్మోహన్ రెడ్డి కోరారు.