Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో మహాత్మా గాంధీ 157 వ జయంతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మహాత్మా గాంధీ 157 వ జయంతి ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Miryalaguda : మిర్యాలగూడలో మహాత్మా గాంధీ 157 వ జయంతి
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మహాత్మా గాంధీ 157 వ జయంతి ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ తో పాటు పలువురు నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.










