Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన.. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన..! 

మహబూబ్‌నగర్ నగరంలో సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కాకుండా, శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన.. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన..! 

మహబూబ్ నగర్ టౌన్, మన సాక్షి:

మహబూబ్‌నగర్ నగరంలో సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కాకుండా, శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్‌లో యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఆయన ముఖ్య పాల్గొన్నారు.

24వ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో 71 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులకు చేశారు. అనంతరం అదే డివిజన్‌లో లక్షల వ్యయంతో ఇప్పటికే పనులు పూర్తి చేసుకున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వార లో యుఐడిఎఫ్ నిధులు 8 లక్షలతో నిర్మించనున్న స్ట్రోమ్ వాటర్ డ్రైన్ కు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా, కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రతి డివిజన్‌లో శాశ్వత పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ పాండురంగా రెడ్డి, తాహేర్, ఫకృ ఖురేషి, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు