చలో ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు..!
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఆధ్వర్యంలో అక్టోబర్ 12న సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.

చలో ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు..!
(శేఖర్ – ఇబ్రహీంపట్నం )
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఆధ్వర్యంలో అక్టోబర్ 12న సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపుతో, టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు, టీపీసీసీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి పయనమయ్యారు.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియపై నిరసన కార్యక్రమం. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ప్రధాన అంశాలుగా నిరసన కార్యక్రమం.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. రాష్ట్ర నాయకత్వం సమన్వయంతో పార్టీ ప్రజాప్రతినిధులు, సంస్థాగత నాయకులు ఢిల్లీ చేరుకుని జాతీయ స్థాయిలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలని కాంగ్రెస్ పార్టీ తన నిరసన ద్వారా స్పష్టం చేయనుంది.