Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్తెలంగాణ

Breaking News : బావిలో పడి ఇద్దరు యువకులు మృతి, పంజాబ్ లో కాల్పుల కలకలం, ఒకే క్లిక్ లో ఎన్నో బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. బుధవారం ఇప్పటివరకు బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

Breaking News : బావిలో పడి ఇద్దరు యువకులు మృతి, పంజాబ్ లో కాల్పుల కలకలం, ఒకే క్లిక్ లో ఎన్నో బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. బుధవారం ఇప్పటివరకు బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

జగిత్యాల జిల్లాలో విషాదం.. బావిలో పడి ఇద్దరు మృతి…!

జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట లో మద్యం మత్తులో ఇద్దరు యువకులు బావిలో పడి మృతి చెందారు. మృతులు ఆంధ్ర ప్రదేశ్ లోని వినుకొండ చెందిన ఆనంద్, సంజయ్ గా గుర్తించారు.

పంజాబ్ లో కాల్పుల కలకలం :

పంజాబ్ లో కాల్పుల కలకలం సృష్టించింది. అమృత్సర్ లోని ఎస్ బ్యాంకులో ఫైరింగ్ జరిగింది. లోన్ మేనేజర్ పై దుండగులు కాల్పులు జరిపారు. మేనేజర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ

వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. బుధవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. వంగవీటి రాధాకృష్ణ ను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించనున్న జనసేన పార్టీ.

Also Read : Suryapet : ఘోర ప్రమాదం.. బస్సు కింద పడి వ్యక్తి మృతి..!

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ :

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 23 కంపార్ట్మెంటుల్లో వేచి ఉన్న భక్తులు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న 84,179 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్నటి శ్రీవారి ఆదాయ ఉండి 3.01 కోట్ల రూపాయలు.

పులి సంచారం :

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా బట్టుగూడెం మండలం లక్ష్మీపురంలో పులి సంచారం. పులిని బంధించేందుకు అటవీకి శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్మారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు