Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

ఏపీలో హై టెన్షన్.. ఎంపీ మిధున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి..!

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో టిడిపి, వైసిపి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.

ఏపీలో హై టెన్షన్.. ఎంపీ మిధున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి..!

(మన సాక్షి, మదనపల్లె – రాజు )

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో టిడిపి, వైసిపి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కార్యకర్తలు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పుంగనూరులో నామినేషన్ వేసే అభ్యర్థులతో కలిసి రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి వెళ్తుండగా అతనిపై రాళ్ల దాడి చేశారు. దాంతో కాన్వాయ్ లోని పది వాహనాలు ధ్వంసం అయ్యాయి.

టిడిపి కార్యకర్త మధు రాయల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ వాతావరణంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వైసిపి నాయకులు నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా ఈ ఘర్షణ జరగడంతో నామినేషన్ అడ్డుకునే ప్రక్రియ జరిగినట్లు తెలుస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో పుంగనూరులో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈసారి కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నది.

మరిన్ని వార్తలు