Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం..!

పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం..!

మహబూబ్ నగర్ టౌన్ – శ్రీశైలం, మన సాక్షి:

పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. రక్తదానం అనేది మరొకరి ప్రాణాలను కాపాడే మహత్తరమైన సేవా కార్యక్రమమని, రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు, ప్రమాద బాధితులకు, ఇతర వైద్య అవసరాలున్న వారికి ప్రాణదానం చేయవచ్చని పేర్కొన్నారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యపరంగా అర్హులైన వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Also Read : Breaking : రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు.. క్షణాల్లోనే పూర్తిగా దగ్ధం.!

పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సేవాభావానికి, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజాసేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుందని పేర్కొన్నారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు జిల్లా ఎస్పీ సర్టిఫికెట్లను ప్రదానం చేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీర్, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

మరిన్ని వార్తలు