మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిండి ప్రాజెక్టు పై కీలక వ్యాఖ్య..!
డిండి ఎత్తిపోతల పథకానికి 0.5 టీ ఎంసీల నీటిని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం ఉమ్మడి నల్గొం డ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష లను నెరవేర్చే దిశగా కీలక ముందడుగని పేర్కొన్నారు.

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిండి ప్రాజెక్టు పై కీలక వ్యాఖ్య..!
నల్లగొండ, మన సాక్షి :
డిండి ఎత్తిపోతల పథకానికి 0.5 టీ ఎంసీల నీటిని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం ఉమ్మడి నల్గొం డ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష లను నెరవేర్చే దిశగా కీలక ముందడుగని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ప్ర త్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నల్గొండలోని తన క్యాంపు కార్యా లయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వినియోగం, డిండి ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై మాట్లాడారు.
డిండి ప్రాజెక్టు రద్దు వ్యాఖ్యలు సమంజసం కాదు
డిండి ప్రాజెక్టును రద్దు చేయాలం టూ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు సరికా వని గుత్తా అభిప్రాయపడ్డారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృ ష్టించడం కంటే, రెండు జిల్లాల రై తాంగానికి ప్రయోజనం చేకూర్చే లా ప్రజాప్రతినిధులు కృషి చేయా లని సూచించారు. బీజేపీ ఎంపీ గా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీ సుకొచ్చి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించాలని కోరారు. జా తీయ హోదా లభిస్తే నిధుల సమీ కరణకు, ప్రాజెక్టు పనుల వేగవం తానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు జీవ నాధారం డిండి
డిండి ఎత్తిపోతల పథకం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కా దని, దశాబ్దాలుగా ఫ్లోరైడ్ స మస్యతో ఇబ్బందులు ఎదు ర్కొం టున్న దేవరకొండ, మునుగోడు ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నీటిని అందించాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక పథకమని గుత్తా వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్ర జల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు.
Also Read : TG News : రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది అరెస్ట్..!
నీటి వనరులను జిల్లా సరిహద్దు ల పేరుతో విభజించి వివాదాలకు తావివ్వడం సరికాదని పేర్కొన్నా రు. ఏ జిల్లా నీరు ఆ జిల్లాకే పరి మితం కావాలనే వాదనను అను సరిస్తే, అంతర్రాష్ట్ర జలాల విష యంలో తెలంగాణకే ఇబ్బందు లు ఎదురయ్యే ప్రమాదం ఉంద న్నారు. ఏఎంఆర్పీ ద్వారా హైద రాబాద్‌కు 30 టీఎంసీల నీటిని అందిస్తున్న విషయాన్ని గుర్తుచే స్తూ, రాష్ట్ర సమగ్ర ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకొని నీటి విని యోగంపై నిర్ణయాలు తీసుకోవా లని సూచించారు.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ప్రాధా న్యం ఇవ్వాలి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిపా దిత సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యం ఉందని, ప్రస్తుతం 7.78 లక్షల ఎకరాల ఆ యకట్టుకు సంబంధించిన సాగు నీటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం, డిండి, దేవాదుల తది తర ప్రాజెక్టుల ద్వారా 7.58 లక్ష ల ఎకరాలకు సాగునీరు అందిం చే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ప నులు పూర్తిస్థాయిలో పూర్తి కాలే దని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో కృ ష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు త గి న ప్రాధాన్యం దక్కలేదని విమ ర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు చేసిన నిధుల్లో సగం కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు కేటాయించి ఉంటే, మరిన్ని ప్రాజెక్టులు పూర్త య్యేవని అభిప్రాయపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూ ర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా లిఫ్ట్ విధానం ద్వారా నీటిని అం దించే అవకాశాలను పరిశీలించా లని సూచించారు. రైతులకు వీ లైనంత త్వరగా సాగునీరు అం దించేందుకు అందుబాటులో ఉ న్న అన్ని మార్గాలను వినియోగిం చుకోవాలని అన్నారు.
పాలమూరు రైతాంగానికి సాగు నీరు అత్యవసరం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో సుమారు 10 లక్షల ఎకరా లకు సాగునీరు అందించాలనే ప్రతిపాదనలు ఉండగా, 8.50 లక్షల ఎకరాలకు సంబంధించిన సాగునీటి సదుపాయాలు ఉన్నా యని గుత్తా తెలిపారు. పాల మూరు ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసలను అరి కట్టాలంటే రైతులకు సాగునీరు అందించడం అత్యంత కీలకమని చెప్పారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంత రై తాంగానికి గణనీయమైన ప్రయో జనం చేకూరుతుందని పేర్కొ న్నారు. నల్గొండ, మహబూబ్ న గర్ జిల్లాల రైతులు నీటి కోసం ప రస్పరం వివాదాలు పడటం వల్ల రెండు ప్రాంతాలకూ నష్టమే జరు గుతుందని హెచ్చరించారు. ఇరు జిల్లాల రైతాంగ ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ల క్ష్యం కావాలని స్పష్టం చేశారు.
చర్చలతోనే జల సమస్యలకు పరిష్కారం
రాష్ట్రాల మధ్య జలవనరులకు సంబంధించిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకో వా లని గుత్తా సుఖేందర్ రెడ్డి సూ చించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తో తెలంగాణ ప్రభుత్వం జరుపు తున్న చర్చలు సఫలమై రాష్ట్రా నికి అనుకూలమైన ఫలితాలు రావాలని ఆకాంక్షించారు. సాగు నీటి ప్రాజెక్టుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సీపీఐ, సీపీఎం నా యకులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులను అభినందించారు.
ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, నీటి లభ్యతకు సం బంధించిన పరిస్థితులను ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారని పేర్కొన్నారు. రా ష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రా జెక్టులను పూర్తి చేయాలనే సంక ల్పంతో ప్రభుత్వం ముందుకు సా గుతోందని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలే ముఖ్యం
ప్రాంతీయ విభేదాలు, రాజకీయా లకు అతీతంగా నల్గొండ, మహ బూబ్‌నగర్ జిల్లాల రైతాంగ ప్ర యోజనాల కోసం ప్రజాప్రతినిధు లు, రాజకీయ పార్టీలు, ప్రజాసం ఘాలు సమష్టిగా కృషి చేయాల ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణా బేసిన్లో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే అత్యంత ప్రాధాన్య అంశమని ఆయన స్పష్టం చేశారు.









