Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

కోతుల కోసం వల వేస్తే కొండచిలువ పడింది. భయంతో చంపేసిన రైతు..!

పత్తి చేనును కోతుల బారి నుండి కాపాడుకునేందుకు రైతు వేసిన వలలో కోతులకు బదులు భారీ కొండచిలువ చిక్కుకున్న వింత ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామ శివారులో చోటుచేసుకుంది.

కోతుల కోసం వల వేస్తే కొండచిలువ పడింది. భయంతో చంపేసిన రైతు..!

శాలిగౌరారం, మన సాక్షి :

పత్తి చేనును కోతుల బారి నుండి కాపాడుకునేందుకు రైతు వేసిన వలలో కోతులకు బదులు భారీ కొండచిలువ చిక్కుకున్న వింత ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామ శివారులో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన రైతు అమరావతి సైదులు తన పత్తి చేనులో పంటకు కోతులు తీవ్ర నష్టం కలిగిస్తుండటంతో, కోతులను అడ్డుకునేందుకు చేను చుట్టూ వలను ఏర్పాటు చేశాడు.

మంగళవారం సాయంత్రం పత్తి చేను లోకి వెళ్లిన రైతుకు వలలో సుమారు 12 అడుగుల భారీ కొండచిలువ చిక్కుకుని ఉండటం కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన రైతు చుట్టుపక్కల రైతులను పిలిచాడు. వారు వచ్చి ఆ కొండచిలువను కొట్టి చంపేశారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కొండచిలువను తిలకించారు.

మరిన్ని వార్తలు