Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణనల్గొండవ్యవసాయం

అన్నదాత ఆశలపై తుఫాన్.. ఆవేదనలో రైతులు..!

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం "రావులపెంటలో" బుధవారం కురిసిన అకాల వర్షానికి వరి పంటలు నేలపాలయ్యాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో వర్షం దెబ్బతీయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాత ఆశలపై తుఫాన్.. ఆవేదనలో రైతులు..!

– అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంటలు

– ఆరుగాలం శ్రమ వృథా.. రైతులకు తీవ్ర నష్టం

నల్లగొండ/వేములపల్లి, మన సాక్షి :

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం “రావులపెంటలో” బుధవారం కురిసిన అకాల వర్షానికి వరి పంటలు నేలపాలయ్యాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో వర్షం దెబ్బతీయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగి ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు అకాల వర్షం మరింత నష్టాన్ని మిగిల్చింది. పంట నేలకొరగడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన తమకు ప్రకృతి వైపరీత్యాలు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని రైతులు వాపోతున్నారు.నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

*రైతాంగంలో తీవ్ర భయాందోళనల:

వరి పంట కోతకు సిద్ధమవుతున్న సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బలమైన గాలులకు వరి పంట నేలకొరిగితే ధాన్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు, కోత పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోతే పంట కోత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతులు మరింత నష్టపోవాల్సి వస్తుందనే భయాందోళన వ్యక్తమవుతోంది.

*పెట్టుబడులు చేతికందేనా..?*

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చుల కోసం రైతులు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టారు. పంట దిగుబడిపై ఆశలు పెట్టుకుని అప్పులు తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న సమయంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు వారిని కలవరపెడుతున్నాయి. పంటకు నష్టం జరిగితే పెట్టుబడులు ఎలా తిరిగి వస్తాయి..? అప్పులు ఎలా తీర్చాలి..? కుటుంబ పోషణ ఎలా..? అంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవాలనే ఆరాటంలో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు.

*చేతికొచ్చే సమయంలో నష్టం:*

“ఎంతో కష్టపడి, అప్పులు చేసి వరి పంట సాగు చేశాం. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షం మా ఆశలను దెబ్బతీసింది. వర్షం కారణంగా వరి పంట నేలకొరిగి దిగుబడి తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరిగి పెట్టుబడి భారం అధికమైంది.ఇప్పుడు పంట దెబ్బతినడంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలి”

– రైతు,ఉత్తర్ల శీను,రావులపెంట”

*పంట నష్టం పై ఆవేదన:*

ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకాల వర్షంతో పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం..పంట సాగు కోసం పెట్టుబడులు పెట్టి, అప్పులు చేసి వ్యవసాయం చేసినప్పటికీ ఆశించిన దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోయాం. పంట నష్టంతో అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాలను ఎలా పోషించాలో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది.

*రైతు,పొడిశెట్టి లింగస్వామి, రావులపెంట”*

మరిన్ని వార్తలు