Nalgonda : ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు, అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన మిర్యాలగూడ పోలీసులు..!
రైతుల వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మ ర్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంత ర్రాష్ట్ర ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ప క్కా నిఘా, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక బృందాల సమన్వయం తో నలుగురు నిందితులను అరె స్ట్ చేశారు.

Nalgonda : ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు, అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన మిర్యాలగూడ పోలీసులు..!
–రూ.50 లక్షల విలువైన నగదు, కార్లు, ఇతర సామగ్రి స్వాధీనం
మన సాక్షి, నల్లగొండ :
రైతుల వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మ ర్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంత ర్రాష్ట్ర ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ప క్కా నిఘా, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక బృందాల సమన్వయం తో నలుగురు నిందితులను అరె స్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.20 లక్షల నగదు, రూ.30 ల క్షల విలువైన రెండు కార్లు, ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైర్, చోరీలకు ఉప యోగించిన పనిముట్లు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసు కున్నారు. ఈ ముఠా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 29 నేరాలకు పాల్పడినట్లు పో లీ సుల విచారణలో వెల్లడైంది.
ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాల రంగంలోకి..
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్య వసాయ విద్యుత్, ఇతర ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు, ఆయి ల్, ఇతర విలువైన భాగాలను దొంగిలిస్తున్న ఘటనలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. మిర్యా లగూడ డీఎస్పీ జి. రవి ఆధ్వ ర్యంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ జె. సోమన ర్సయ్య, మిర్యాలగూడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి. ప్ర సాద్, వేములపల్లి ఎస్ఐ వి. సు రేశ్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని నాగార్జునసాగర్ ఎడమ కా లువకు చెందిన ఎల్-15 లిఫ్ట్ ఇరి గేషన్ స్కీమ్‌లో 500 కేవీఏ ట్రా న్స్ఫార్మర్ నుంచి 300 కిలోల కా పర్, 250 లీటర్ల ఆయిల్ చోరీకి గురైన ఘటనపై ఆగస్టు 22, 20 26న కేసు నమోదైంది. క్రైమ్ నం బర్ 198/2026 కింద దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇతర ప్రాం తాల్లో జరిగిన చోరీలతోనూ ఈ ముఠాకు సంబంధాలున్నట్లు గుర్తించారు.
వాహన తనిఖీలతో బయట పడిన నేరాల చిట్టా
అక్టోబర్ 28న మధ్యాహ్నం వే ములపల్లి గ్రామ శివారులోని సూ ర్యాపేట ఎక్స్‌రోడ్డు వద్ద పోలీ సు లు వాహన తనిఖీలు నిర్వహి స్తుండగా అనుమానాస్పదంగా వ చ్చిన కారును ఆపి తనిఖీ చే శా రు. అందులో ఉన్న ముగ్గురు వ్య క్తుల్లో చంద్ పాషా అనే పాత నేర స్థుడిని గుర్తించారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసులో అతడిపై గతంలో నూ కేసు ఉన్నట్లు పోలీసులు తె లిపారు.
కారులో కట్టర్లు, పానాలు, గ్లౌజు లు వంటి సామగ్రి లభించడంతో అనుమానం మరింత బలపడిం ది. వారిని విచారించగా ట్రాన్స్‌ఫా ర్మర్ల నుంచి కాపర్, ఆయిల్, ఇత ర సామగ్రిని దొంగిలించి హైదరా బాద్‌లోని హయత్‌నగర్ ప్రాంతం లో పాత సామగ్రి వ్యాపారికి విక్ర యించినట్లు వెల్లడించినట్లు పోలీ సులు పేర్కొన్నారు. దొంగిలించిన సామగ్రి విక్రయానికి సంబంధిం చి న నగదు, కాపర్‌ను స్వాధీనం చే సుకునే క్రమంలో నాలుగో నింది తుడిని కూడా అదుపులోకి తీసు కున్నారు.
రాత్రివేళల్లో ట్రాన్స్ఫార్మర్లే లక్ష్యం
నిందితులు తక్కువ సమయం లో ఎక్కువ డబ్బు సంపాదించా లనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి నట్లు పోలీసుల విచారణలో తే లింది. గ్రామాలకు దూరంగా ఉ న్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, రా త్రివేళల్లో కార్లలో అక్కడికి చేరు కునేవారు. కట్టర్లు, పానాల సా యంతో ట్రాన్స్ఫార్మర్లను తెరిచి కాపర్ వైర్లు, ఆయిల్, అల్యూమి నియం వైర్లను అపహరించే వా రు.దొంగిలించిన సామగ్రిని పాత వ స్తువుల వ్యాపారులకు విక్ర యించి వచ్చిన డబ్బును పంచు కునే వారని పోలీసులు తెలి పా రు. పోలీసులకు అనుమానం రా కుండా ఉండేందుకు నకిలీ నంబ ర్ ప్లేట్లు ఉపయోగించడం, మహి ళలను కూడా వాహనాల్లో వెంట తీసుకె ళ్లడం వంటి పద్ధతులను అనుస రించినట్లు విచారణలో వెల్లడైంది.
Also Read : Cotton : పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 8667.. రైతులకు అండగా సీసీఐ కేంద్రం..!
నల్గొండ జిల్లాలోనే 18 చోరీలు
ఈ ముఠా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 29 నేరాలకు పాల్పడి న ట్లు పోలీసులు గుర్తించారు. తె లంగాణలో 25, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.నల్గొండ జిల్లాలో వేములపల్లి, వాడపల్లి, మాడ్గుల పల్లి, అడవిదేవులపల్లి, మిర్యా లగూడ టూ టౌన్, తిరుమలగిరి సాగర్, హాలియా, త్రిపురారం, కనగల్, చింతపల్లి, నేరెడుగొ మ్ము, దేవరకొండ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 నేరాలకు పా ల్పడినట్లు తెలిపారు. తెలంగాణ లోని ఇతర ప్రాంతాల్లో మరో ఏ డు, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు ప్రాంతం, మాచవరం, దాచేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో నాలుగు నేరాలకు సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు.
నలుగురు అరెస్ట్.. మరో ఐదు గురి కోసం గాలింపు
ఈ కేసులో షేక్ చంద్ పాషా(26), రామావత్ సూర్య (19), గలబ సా యి కిరణ్ (19), ఇస్లావత్ దే శిరామ్ (24)లను అరెస్ట్ చేసిన ట్లు పోలీసులు వెల్లడించారు. వీ రిలో దేశిరామ్ దొంగిలించిన సా మగ్రిని కొనుగోలు చేసిన వ్యక్తిగా పేర్కొన్నారు. ముఠాకు చెందిన మరో ఐదుగురు—సంతోష్, నా న్కు, మోడల్ సాయి, ప్రియా, సు నీత—పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభి నందనలు
కేసును ఛేదించడంలో కీలక పా త్ర పోషించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సోమన ర్స య్య, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.ఎన్.డి. ప్రసాద్, ఎస్ఐలు, సీ సీఎస్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర ప వార్ అభినందించారు. వారికి రి వార్డులు ప్రకటించినట్లు తెలిపా రు.ట్రాన్స్ఫార్మర్ల చోరీలతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ అరెస్టులు ఊరటనిచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. వ్యవసా య విద్యుత్ సరఫరాకు అంతరా యం కలిగించే దొంగతనాలపై కఠి న చర్యలు కొనసాగిస్తామని స్ప ష్టం చేశారు.









